కడపలో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేధాలు నెలకొన్నాయి. ఆర్టీసీ చార్జీల పెంపుపై బస్టాండ్ దగ్గర టీడీపీ శ్రేణుల నిరసన వ్యక్తం చేశారు. తాము లేకుండా ధర్నా ఎలా చేస్తారంటూ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అమీర్‌బాబు వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు బలదాసు, సురేష్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దుర్భషలాడుతూ బాలదాసు, సురేష్ అనే వ్యక్తులు కొట్టుకున్నారు.