అగ్నికుల క్షత్రియులను అర్థం చేసుకోండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-27T20:58:40+05:30 IST

అగ్నికుల క్షత్రియుల బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించడంపై అగ్ని(వన్నియ)కుల క్షత్రియుల

అగ్నికుల క్షత్రియులను అర్థం చేసుకోండి: చంద్రబాబు

అమరావతి: అగ్నికుల క్షత్రియుల బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించడంపై అగ్ని(వన్నియ)కుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే ఈ అగ్నికుల క్షత్రియులే 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ కోసం1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం చేసిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు, నిర్వహణతో పాటు, రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం, రథాన్ని లాగడం 200 ఏళ్ళుగా చేస్తున్నారన్నారు. అలాంటిది రథ నిర్మాణం విషయంలో తమ ప్రతిభను గుర్తించలేదంటోన్న వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు.  



Updated Date - 2020-09-27T20:58:40+05:30 IST