ఊరూరా కరోనా

ABN , First Publish Date - 2020-08-12T09:17:25+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ అమెరికా, బ్రెజిల్‌ స్ధాయికి చేరిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చే శారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో

ఊరూరా కరోనా

  • వైసీపీ చర్యలతోనే వ్యాప్తి..
  • అమెరికా స్థాయిలో రాష్ట్రంలో విజృంభణ
  • దళితులు, గిరిజనులపై ఇన్ని దాడులా?: బాబు
  • కేసీఆర్‌తో హనీమూన్‌ ముగిసిందా: బుచ్చయ్య

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విజృంభణ అమెరికా, బ్రెజిల్‌ స్ధాయికి చేరిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చే శారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో  11 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైసీపీ చర్యల వల్లే కరోనా ఊ రూరా పాకిందన్నారు. ‘పీపీఈ కిట్లు లేవని వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు, నర్సులు ఆందోళనకు దిగడం దేశంలో మన రాష్ట్రంలోనే. వైర్‌సను అదుపు చేయడం మాని ప్రతిపక్షాలను అదుపు చేయడానికి ప్రభుత్వం పూర్తికాలం పనిచేస్తోంది. మునిసిపల్‌ కార్యాలయంలో బీసీ నాయకు డి ఫొటో ఎందుకు తీసేశారని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టడం చూస్తే ఎంత పచ్చిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో తె లుస్తోంది.


జగన్‌ హయాంలో.. కచ్చలూరు బోటు ప్రమాదంలో 54 మంది, శానిటైజర్‌ తాగి 22 మంది, విజయవా డ క్వారంటైన్‌ కేంద్రంలో 10 మంది, ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో 12 మంది, విశాఖ గ్యాస్‌ లీకేజీలో 12 మం ది, షిప్‌యార్డులో క్రేన్‌ కూలి 11 మంది చనిపోయారు. భవన నిర్మాణ కార్మికులు, రైతుల ఆత్మహత్యలు అదనం. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరిగినన్ని దాడులు చ రిత్రలో ఎప్పుడూ లేవు. తనకు నక్సలైట్లలో కలవడానికి అ నుమతి ఇవ్వాలని దళిత యువకుడు రాష్ట్రపతికి లేఖ రా యడం దిగజారిన శాంతిభద్రతలకి నిదర్శనం’ అన్నారు.


ఏం చేశారో చెప్పండి..

ఏది అభివృద్ధి... ఏది విధ్వంసం అన్నదానిపై ప్రజల్లో చర్చ పెట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపిచ్చారు. ‘మనం అధికారంలో ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఏం చేశా మో ప్రజలకు వివరిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఈ 14 నెలల్లో ఏం చేసిందో చూపించాలని సవాల్‌ చేస్తున్నాం. గోదావరి జలాలను బొల్లాపల్లి, బానకచర్ల మీదుగా రాయలసీమకు తీసుకెళ్లాలని మనం అనుకుంటే ఈ ప్రభుత్వం పక్కన పడేసింది. నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశారు. 63 సాగునీటి ప్రాజెక్టులు మొదలు పెట్టి 23 పూర్తి చేశాం. వీళ్ళు రాగానే మిగిలిన వాటి పనులు రద్దు చేశా రు. ఏడాది అయిన తర్వాత మరో దారి దొరక్క మళ్లీ వాళ్ల నే పిలిచి పనులు చేయాలని ఇస్తున్నారు. ఇంత తప్పుడు పనులు చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదు. తప్పుడు నిర్ణయాలను కోర్టులు కొట్టివేస్తే దానికి ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నారు. ఈవిషయాలను ప్రజల్లోకితీసుకెళ్లాలి’ అన్నారు.


రాష్ట్రంలో కరోనా కేంద్రాల్లో బాధితులకు సరైన భోజనం పెట్టకపోవడంతో వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు ఏమయ్యాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కరోనా వ్యాప్తిలో మరో వూహాన్‌లా తయారైందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ హనీమూన్‌ ముగిసినట్లే ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. నమ్మి ఓట్లు వేసిన దళితుల ప్రాణాల ను ఈ ప్రభుత్వం బలిగొంటోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కలు పీక్కుతిన్న మృతదేహం దళిత వీఆర్‌ఏ ఇత్తడి కాంతారావుదని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. కాగా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన టీడీపీ కార్యకర్త రాకేశ్‌పై స్థానిక పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని చంద్రబాబు డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో అనేకచోట్ల వైసీపీ నేత లు కావాలని సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలపై పోస్టింగులు పెడుతున్నారని, వాటికి టీడీపీ కార్యకర్తలు సమాధానం ఇస్తే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇదిలావుంటే, తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకూ సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు. ఆడబిడ్డలకు సమాన హక్కులు ఉండాలని 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్‌ ఆకాంక్షించి, అమలు చేశారని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


వైసీపీ వల్లే మైనస్‌ వృద్ధి:  యనమల

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పారిశ్రామిక విధా నం బడుగు, బలహీనవర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాన్ని కాలరాసిందని టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రోత్సాహకాల్లో కోతలు పెట్టారన్నారు. ప్రభుత్వ నిర్వా కంతో పారిశ్రామికరంగం 2.2ు మైనస్‌ వృద్ధిలోకి ప డిందన్నారు. తయారీ, నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌.. రం గాలు తిరోగమనం పట్టాయన్నారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలుచేయకుండా నిలిపేసి.. తెచ్చిన కొత్త విధానం వృథా ప్రయాసగా పేర్కొన్నారు. కాగా, బాబు హయాంలో అభివృద్ధిలో దూసుకెళ్లిన రాష్ట్రం జగన్‌ పాలనలో కరోనాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. ‘‘ప్రచార యావ, వ్య క్తిగత స్వార్థంతో జగన్‌ సీమకు ద్రోహం చేస్తున్నారు. 15 నెలల పాలనలో సీమకు ఏం చేశారో చెప్పాలి’’ అ ని మాజీమంత్రి కాల్వశ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-12T09:17:25+05:30 IST