బ్రిటన్, ఐరోపాలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN , First Publish Date - 2022-04-20T03:07:01+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను NRI తెలుగుదేశం పార్టీ యూరోప్ TEAM ఘనంగా నిర్వహించింది.

బ్రిటన్, ఐరోపాలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను NRI తెలుగుదేశం పార్టీ యూరోప్ TEAM ఘనంగా నిర్వహించింది. కిషోర్ చలసాని ఆధ్వర్యంలో నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని, శ్యామ్ సుందర్ రావు ఊట్ల సమన్వయంతో పలు నగరాల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చంద్రబాబును నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా వారు అభివర్ణించారు. నేటి చంద్రబాబు ఆలోచనలే రేపటి భారత దేశ ఆచరణలని, ఆయనో విజినరీ అని ప్రశంసించారు.  తమ ఉన్నతికి కారణమైన, తమలాంటి ఎంతో మందిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా IT ని ప్రోత్సహించి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఎన్నారైలు చంద్రబాబు హయాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో కీలకంగా మారిన హైటెక్ సిటీ నిర్మాణం వెనకాల చంద్రబాబు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు, ‘మీ సేవ’తో  ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయడం, ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి కోసం కమిషన్ ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాల వెనుక టీడీపీ అధినేత కృషి ఉందన్నారు.  హైదరాబాద్‌ను ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రెండో కేంద్రంగా చేసిన ఘనత టీడీపీ అధ్యక్షుడిదేనంటూ ప్రశంసించారు. విజన్ 2020 పేరుతో భావితరాల కోసం చంద్రబాబు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. దేశరాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారని, దళిత వర్గానికి చెందిన నారాయణ్‌ను రాష్ట్రపతిగా ఎంపిక కావడంలో, దక్షిణాదికి చెందిన దేవగౌడ ప్రధాని అవడంలో చంద్రబాబు రాజకీయ వ్యూహా చతురత ఉందని గుర్తు చేసుకున్నారు. 2024లో ముఖ్యమంత్రి కాబోయేది ఆయనే అని ధీమా వ్యక్తం చేసిన ఎన్నారైలు.. నవ్యాంధ్ర, అమరావతిని నిర్మించేది టీడీపీ అధినేతేనని ఢంకా బజాయించి చెప్పారు. ఆయన హయాంలోనే పోలవరం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు.. ఉమ్మడి ఆంద్రప్రదే‌శ్‌ను, నవ్యాంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు  ఎలా అభివృద్ధి చేశారో.. దేశ విదేశాలకు వెళ్లి IT కంపెనీల అధినేతలను ఎలా ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారనే విషయాలను వివరించారు.  కార్యక్రమంలో రమ్య రెడ్డి, జగదీష్ మెడిశెట్టి, ధనుంజయ్ గుజ్జల తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2022-04-20T03:07:01+05:30 IST