అమరావతి: ఎన్నికల్లో మనీ, పవర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జగన్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డులు ఇవ్వొచ్చని మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలపై పోలీసులు, గూండాలతో దాడులు చేయించారని మండిపడ్డారు. అక్రమ మార్గాల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆరోపించారు. తమ పాలనపై నమ్మకం లేకే వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారని అన్నారు. వైసీపీ నేతల అక్రమాలపై కుప్పం ప్రజలు వీరోచితంగా పోరాడారని చెప్పారు. కుప్పంలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.