Abn logo
Oct 1 2020 @ 17:21PM

విశాఖలో నెలకు పది వేల టన్నులు దోపిడీ: అయ్యన్నపాత్రుడు

Kaakateeya

విశాఖ: వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల్లో దోపిడీ జరుగుతోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ఇసుకను దోచుకుంటున్నారు...ఇదంతా సీఎంకు తెలిసే జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో నెలకు పది వేల టన్నులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు నాటుసారా వైపు వెళ్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. 

Advertisement
Advertisement
Advertisement