యాక్సెంచర్‌ వెనక్కు... ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్

ABN , First Publish Date - 2020-10-10T00:32:52+05:30 IST

టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)... ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థగా అవతరించింది. నిన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్‌ వెనక్కు వెళ్ళింది. టీసీఎస్ షేర్ విలువ నిన్న మూడు శాతానికి పైగా లాభపడి రూ. 2,818 వద్ద ముగిసింది.

యాక్సెంచర్‌ వెనక్కు... ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్

 ముంబై : టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)... ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థగా అవతరించింది. నిన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్‌ వెనక్కు వెళ్ళింది. టీసీఎస్ షేర్ విలువ నిన్న మూడు శాతానికి పైగా లాభపడి రూ. 2,818 వద్ద ముగిసింది.


షేర్ దూకుడుతో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లను దాటేసింది. ఈ క్రమంలో... ప్రపంచ అత్యంత విలువైన ఐటీ సంస్థగా అవతరించింది.  బైబ్యాక్ వార్తలతో ఈ షేర్ భారీగా లాభపడింది. టీసీఎస్ షేర్ ధర రూ. 2,800 దాటడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,59,973.63 కోట్లకు చేరుకుంది. డాలర్ వ్యాల్యూలో రూ.144.73 బిలియన్ డాలర్లుగా ఉంది.


యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 143.4 బిలియన్ డాలర్లు (రూ. 10.52 లక్షల కోట్లు)గా ఉంది. దీంతో మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్ అగ్రస్థానానికి చేరుకుంది. యాక్సెంచర్ రెండో స్థానానికి దిగిజారింది. మరో ప్రపంచ ఐటీ దిగ్గజం ఐబీఎం 118.5 బిలియన్ డాలర్ల(8.67 లక్షల కోట్లు)తో మూడో స్థానంలో ఉంది.


Updated Date - 2020-10-10T00:32:52+05:30 IST