టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు గొప్ప శుభవార్త!

ABN , First Publish Date - 2020-03-29T22:02:32+05:30 IST

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. త్వరలోనే వీరికి ఉచిత ల్యాండ్‌లైన్ సర్వీసు అందించేందుకు టాటా స్కై

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు గొప్ప శుభవార్త!

న్యూఢిల్లీ: టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. త్వరలోనే వీరికి ఉచిత ల్యాండ్‌లైన్ సర్వీసు అందించేందుకు టాటా స్కై సిద్ధమవుతోంది. ఫలితంగా జియో ఫైబర్, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే ఉచిత ల్యాండ్‌లైన్ సర్వీసును అందిస్తున్నాయి. అయితే, టాటా స్కై తమ వినియోగదారులకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. టాటా స్కైలో అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా ప్రయోజనాలు నెలకు రూ. 900 ప్లాన్ నుంచే లభిస్తాయి. అయితే, టాటా స్కై తాజా ఆఫర్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుందన్న విషయం తెలియరాలేదు.  

Updated Date - 2020-03-29T22:02:32+05:30 IST