మార్కెట్లోకి టాటా పంచ్‌

ABN , First Publish Date - 2021-10-19T08:05:14+05:30 IST

టాటా మోటార్స్‌ కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టాటా పంచ్‌ పేరుతో సబ్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది.

మార్కెట్లోకి టాటా పంచ్‌

 ప్రారంభ ధర రూ.5.49 లక్షలు 

న్యూఢిల్లీ:  టాటా మోటార్స్‌ కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టాటా పంచ్‌ పేరుతో సబ్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఢిల్లీ ఎక్స్‌షోరూం) రూ.5.49 లక్షలు. టాప్‌ వేరియంట్‌ ధర రూ.9.09 లక్షలు. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు.. మాన్యువల్‌, ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లలో లభించనుంది. మాన్యువల్‌ వేరియంట్‌ లీటరుకు 18.97 కిలోమీటర్లు, ఆటోమెటిక్‌ వేరియంట్‌ లీటరుకు 18.82 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. అంతర్జాతీయ వాహన భద్రత ధ్రువీకరణ సంస్థ జీఎన్‌సీఏపీ నుంచి ఈ కారుకు 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ లభించిందని టాటా మోటార్స్‌ తెలిపింది. 

Updated Date - 2021-10-19T08:05:14+05:30 IST