ఏప్రిల్ 10,11 తేదీల్లో ‘తానా’ ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం

ABN , First Publish Date - 2021-04-05T15:54:02+05:30 IST

ఉగాది పర్వదినం సందర్భంగా సాహితీ చరిత్రలోనే ఓ వినూత్న కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీల్లో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలు

ఏప్రిల్ 10,11 తేదీల్లో ‘తానా’ ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం

వాషింగ్టన్: ఉగాది పర్వదినం సందర్భంగా సాహితీ చరిత్రలోనే ఓ వినూత్న కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీల్లో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21’ కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 21దేశాల నుంచి 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్, తానా మహిళా విభాగాం సమన్వయ కర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం 21 గంటలపాటు కొనసాగుందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. 



ఈ కార్యక్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జి. చంద్రయ్య(తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్), విశిష్ట అతిథిగా గరికపాటి నరసింహారవావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరవుతారని డా. ప్రసాద్ తోటకూర చెప్పారు. 21 గంటలకుపైగా కొనసాగే ఈ కార్యక్రమ ముగింపు వేడుకలకు పద్మభూషణ్ డా.కే.ఐ.వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత, నటుడు తనికెళ్ల భరణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్, ఈనాడు ముఖ్య ఉప సంపాదకులు విష్ణు జాస్తి, మనతెలంగాణ సంపాదకమండలి సలహాదారు శ్రీరామ మూర్తి, సాక్షి ముఖ్య సంపాదకులు దిలీప్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. 



ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, 225 మంది కవులు, 21దేశాల్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని తానా యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ మాద్యమాల ద్వారా వీక్షించొచ్చని చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలకు www.tana.orgను సందర్శించొచ్చని శిరీష తూనుగుంట్ల పేర్కొన్నారు.  

Updated Date - 2021-04-05T15:54:02+05:30 IST