తెలంగాణ సీఎం సహాయనిధికి ‘నాటా’ రూ.5లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-04-29T21:05:31+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సైతం ప్రతిరోజు వేలాది మంది ప్రజలు మహమ్మారి బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా తెలుగు

తెలంగాణ సీఎం సహాయనిధికి ‘నాటా’ రూ.5లక్షల విరాళం

హైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సైతం ప్రతిరోజు వేలాది మంది ప్రజలు మహమ్మారి బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5లక్షల విరాళం అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి జమచేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, ప్రభుత్వానికి సహకరించాలని నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమర్‌నాథ్ గుండా, సెక్రటరీ రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణ రెడ్డి కోరారు. కాగా.. గత ఏడాది కూడా నాటా సీఎం సహాయనిధికి రూ.10లక్షల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. 




Updated Date - 2021-04-29T21:05:31+05:30 IST