తమిళిసైకి గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-03-05T08:57:54+05:30 IST

తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మాక గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-

తమిళిసైకి గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మాక గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2021కు ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన  మల్టీ ఎథినిక్‌ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్‌ అనే సంస్థ గ్లోబల్‌ ఉమెన్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు గవర్నర్‌ను ఎంపిక చే సింది.


ఈనెల 7వ తేదీన జరిగే 9వ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్చువల్‌ విధానంలో  ఈ అవార్డును అమెరికా నుంచి గవర్నర్‌కు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును అందుకోనున్నవారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీ్‌సతో పాటు 20 మంది ప్రముఖులు ఉన్నారని రాజ్‌భవన్‌ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 


Updated Date - 2021-03-05T08:57:54+05:30 IST