జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్‌ది కీలక పాత్ర : మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-25T22:09:07+05:30 IST

జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ..

జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్‌ది కీలక పాత్ర : మంత్రి తలసాని

హైదరాబాద్: జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం  HICCలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి తలసాని, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,  హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పరిశీలించారు. ఈసందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ..  మాకు ప్రజలతోనే పొత్తులు అని  చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు. బీజేపీ మాకు పోటీనే కాదు...మాకు పొత్తులు అవసరం లేదని తెలిపారు. బీజేపీ వాళ్లు ఎక్కువ ఊహించుకుని మాట్లాడుతున్నారన్నారు. మతాల పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈసారి టీఆర్ఎస్ ప్లీనరీకి చాలా ప్రత్యేకత ఉంది కేసీఆర్ నాయకత్వంలో కరెంట్ కష్టాలు తగ్గాయి...మంచి నీటి కష్టాలు తీరాయన్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని చెప్పారు. 


దేశాన్ని నడిపిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కుక్కల్లా అరుస్తున్నారు.. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండాలో సమావేశాల్లో తీర్మానాలు చేయనున్నామన్నారు. కాంగ్రెస్‌కు దిక్కుమొక్కు లేదని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడన్నారు. గతంలో స్వతంత్రంగా పోటీచేశాం... భవిష్యత్‌లో కూడా స్వతంత్రంగా పోటీ చేస్తామని పిలుపునిచ్చారు. బండి సంజయ్‌కి గురువు కేసీఆర్  అయితే... కేసీఆర్ దగ్గరకే రావొచ్చు కదా అని మంత్రి తలసాని పేర్కొన్నారు.



Updated Date - 2022-04-25T22:09:07+05:30 IST