ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకానికి రూ.25 కోట్లు వసూలు చేశారని జూలై 3న సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ఏం ఆధారాలు ఉన్నాయని సుధీర్‌రెడ్డిని ఠాగూర్ నోటీసులో కోరారు. సుధీర్‌రెడ్డి ఆరోపణలతో ఠాగూర్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని నోటీసులో న్యాయవాది రవీంద్రన్ పేర్కొన్నారు. రాతపూర్వకంగా వారంరోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని ఠాగూర్ తరపు లాయర్ తెలిపారు.