తాడేపల్లిగూడెం నిట్‌లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-02-28T23:18:49+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కాలేజీ క్యాంటీన్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భోజనంలో పురుగులు

తాడేపల్లిగూడెం నిట్‌లో ఉద్రిక్తత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కాలేజీ క్యాంటీన్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భోజనంలో పురుగులు వచ్చాయని, శుభ్రత పాటించడం లేదంటూ విద్యార్థులు భోజనాలు మానేసి ఆందోళనకు దిగారు. విద్యార్థులకు, నిట్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిట్ విద్యార్థులు అఖిల భారత విద్యా పరిషత్‌ను ఆశ్రయించారు. నెల రోజుల నుండి చెబుతున్నా.. పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చి శుభ్రమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-02-28T23:18:49+05:30 IST