కావలసినవి: చిలగడదుంపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, నిమ్మకాయ - ఒకటి, పల్లి పట్టీలు - ఐదారు, పల్లీలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి, స్పైరలైజర్తో నూడుల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగి పెట్టుకున్న చిలగడదుంపలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పల్లి పట్టీలు వేసి వేగించి తీసుకోవాలి. పల్లి పట్టీలను వేగించి పెట్టుకున్న చిలగడదుంపలపై వేయాలి. పల్లీలు వేసి, నిమ్మరసం పిండి, కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిస్ చేసి సర్వ్ చేసుకోవాలి.