India-UAE travel: భారతీయులకు గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-07-04T14:36:36+05:30 IST

భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది.

India-UAE travel: భారతీయులకు గుడ్‌న్యూస్!

అబుధాబి: భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. జూలై 15 వరకు మాత్రమే ఈ నిషేధం ఉంటుందని పేర్కొంది. కనుక 16వ తేదీ నుంచి భారత్‌కు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అధికారి వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా కారణంగా ప్రయాణాలపై ఆంక్షలతో ఇక్కట్లు పడుతున్న భారత ప్రవాసులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. 


అయితే, ఈ విషయంలో జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీదే(జీసీఏఏ) తుది నిర్ణయమని పేర్కొంది. కరోనా పరిస్థితులు చక్కబడితే అనుకున్న సమయానికే ఇండియాకు యధావిధిగా విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని ఎమిరేట్స్ తెలియజేసింది. ఇక మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి భారత్‌కు విమాన రాకపోకలపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధ ఆంక్షల నుంచి యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, సవరించిన కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది.

Updated Date - 2021-07-04T14:36:36+05:30 IST