సిద్దిపేట: అవకతవకలకు పాల్పడిన హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలోని కొండపాక మండలంలోగల కుకునూర్‌పల్లి హెడ్మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19కి సంబంధించిన 60 మందికి చెందిన రవాణా ఖర్చులలో 4,09,800 రూపాయలు ప్రభుత్వ నిధులలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హెడ్మాస్టర్‌పై విచారణ అనంతరం సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమాకాంత్‌రావు ఆదేశాలు జారీ చేసారు.