మరో నెల ఆగాలి

ABN , First Publish Date - 2020-06-11T09:39:26+05:30 IST

టీ20 వరల్డ్‌ క్‌పపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. బుధవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బోర్డు వీడియో కాన్ఫరెన్స్‌లో పొట్టి కప్‌ ...

మరో నెల ఆగాలి

టీ20 వరల్డ్‌క్‌పపై నిర్ణయం జూలైకి వాయిదా

 ‘పన్ను’పై బీసీసీఐకి ఆరు నెలల గడువు

ముగిసిన ఐసీసీ సమావేశం

ఐపీఎల్‌పై వీడని అనిశ్చితి

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ క్‌పపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. బుధవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బోర్డు వీడియో కాన్ఫరెన్స్‌లో పొట్టి కప్‌ భవితవ్యం తేలుతుందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెగా టోర్నీ వాయిదా పడుతుందని భావించారు. కానీ, ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌క్‌పపై నిర్ణయాన్ని ఐసీసీ వచ్చే నెలకు వాయిదా వేసింది. మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్‌ ఎన్నికపై కూడా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఏడాది జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌క్‌పకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా జూలైలోనే తీసుకోనున్నారు. ఈ-మెయిల్స్‌ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. అందుకే అది మంచి నిర్ణయమై ఉండాలి. సభ్య దేశాలు, ప్రసారదారులు, భాగస్వామ్య పక్షాలు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదింపులు కొనసాగిస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా టీ20 ప్రపంచక్‌పను ఆస్ట్రేలియాలోనే నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం మెగా టోర్నీ నిర్వహణపై అంతగా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు కనిపించడం లేదు. సీఏ దృష్టంతా ఈ ఏడాది ఆఖర్లో భారత్‌తో జరిగే టెస్ట్‌ సిరీ్‌సపైనే ఉంది. అయితే, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. అంటే వరల్డ్‌క్‌పపై నిర్ణయం కొత్త చైర్మన్‌ తీసుకొనే అవకాశం ఉంది. కానీ, చైర్మన్‌ ఎన్నికల నామినేషన్ల విషయమై ఈ సమావేశంలో ఎటువంటి స్పష్టతా రాలేదు. 


మరో ఆరు నెలల సమయం..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి కొంత ఊరట దక్కిందనే చెప్పుకోవాలి. టీ20 వరల్డ్‌క్‌ప-2021కు సంబంధించి పన్ను మినహాయింపుల విషయంలో బీసీసీఐకి విధిం చిన డెడ్‌లైన్‌ను డిసెంబరు వరకు పొడిగించాలని ఐసీసీ నిర్ణయించింది. పన్ను విషయమై బీసీసీఐ, ఐసీసీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 18లోపు ఏ విషయం తేల్చకపోతే.. వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను రద్దు చేస్తామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. కానీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈనె 30 వరకు సమయం కావాలని బీసీసీఐ కోరిన సంగతి తెలిసిందే. అయితే, వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు ఐపీఎల్‌ కూడా అనిశ్చితిలో పడింది.

Updated Date - 2020-06-11T09:39:26+05:30 IST