Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 31 2021 @ 08:28AM

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు పోటెత్తుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 38,701 క్యూసెక్కులు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 173 అడుగులుగా కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.10 టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి కోసం 13,200 క్కూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు యూనిట్లలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Advertisement
Advertisement