పగలు ఎండ.. రాత్రి వర్షం

ABN , First Publish Date - 2020-07-14T08:13:04+05:30 IST

కోస్తాపైకి పడమర దిశ నుంచి గాలులు వీశాయి. ఇంకా అనేకచోట్ల ఎండ తీవ్రత నెలకొనడంతో

పగలు ఎండ.. రాత్రి వర్షం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): కోస్తాపైకి పడమర దిశ నుంచి గాలులు వీశాయి. ఇంకా అనేకచోట్ల ఎండ తీవ్రత నెలకొనడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి సోమవారం పలుప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. దెందులూరు 97, నల్లజర్ల 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈనెల 15,16,17 తేదీల్లో వర్షాలకు విరామం వచ్చే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కాగా, గత 5 రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చెరువులు పొంగి పొర్లాయి. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఊరుకి ఆనుకుని ఉన్న చెరువుకు గండి పడటంతో గ్రామస్థులంతా  ఇసుక బస్తాలు వేసి పూడ్చేశారు. భారీ వర్షాలకు సాగులో ఉన్న పంట చేలు ముంపు బారిన పడ్డాయి. వరి నారుమళ్లు కుళ్లిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు 26 గ్రామాల్లోని 1648 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది.

Updated Date - 2020-07-14T08:13:04+05:30 IST