13 ఏళ్ల బాలుడిని.. వీడియో కాల్ ద్వారా స‌ర్‌ప్రైజ్ చేసిన గూగుల్ బాస్‌!

ABN , First Publish Date - 2021-06-16T16:28:11+05:30 IST

గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌కు సంబంధించిన‌ ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

13 ఏళ్ల బాలుడిని.. వీడియో కాల్ ద్వారా స‌ర్‌ప్రైజ్ చేసిన గూగుల్ బాస్‌!

వాషింగ్ట‌న్‌: గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌కు సంబంధించిన‌ ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కు ఈ వీడియోలో ఏం ఉందో తెలుసా? 2021 డూడుల్ ఫ‌ర్‌ గూగుల్ కాంటెస్ట్ విన్న‌ర్‌ను సీఈఓ స్వ‌యంగా వీడియో కాల్ చేసి చెప్పడం. అమెరికాలోని కెంటూకీకి చెందిన 13 ఏళ్ల బాలుడు మిలో గోల్డిండ్ ఇటీవ‌ల గూగుల్ నిర్వ‌హించిన 2021 డూడుల్ ఫ‌ర్‌ గూగుల్ కాంటెస్ట్‌లో విజేత నిలిచాడు. దాంతో సుంద‌ర్ పిచాయ్ స్వ‌యంగా గోల్డింగ్‌కు వీడియో కాల్ చేసి స‌ర్‌ప్రైజ్ చేశారు. కాంటెస్ట్‌లో గోల్డింగ్ ఆర్ట్ వ‌ర్క్‌ డూడుల్‌కు ఎంపికైందని చెప్పడంతో అత‌డి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. స్వ‌యంగా గూగుల్ బాస్ త‌న‌ను వీడియో కాల్ ద్వారా విజేత‌గా ప్ర‌క‌టించ‌డంతో గోల్డింగ్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ‌య్యాడు. 'మిలోతో ఈ వార్త‌ను పంచుకోవ‌డం నా ఈ వారంలోనే హైలైట్' అంటూ సుంద‌ర్ పిచాయ్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.    





Updated Date - 2021-06-16T16:28:11+05:30 IST