సారీ..ఈ పొరపాటు ఇటీవల పలుమార్లు జరిగింది.. గూగుల్ సీఈఓ వ్యాఖ్య! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-29T03:16:06+05:30 IST

కరోనా సంక్షోభం తరువాత అందరికీ ఆన్‌లైన్ మీటింగులు పరిచయమయ్యాయి. అయితే.. ఈ కొత్త పద్ధతికి అలవాటు పడటానికి ప్రజలకు చాలా సమయమే పట్టింది. కొందరు ఇప్పటికీ అప్పుడప్పుడూ తడబడుతుంటారు. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమ మైక్‌ను ఆన్ చేయడం మర్చిపోతారు. అయితే.. గూగుల్ సీఈఓకు కూడా అచ్చం ఇటువంటి పరిస్థితే ఎదురైంది.

సారీ..ఈ పొరపాటు ఇటీవల పలుమార్లు జరిగింది.. గూగుల్ సీఈఓ వ్యాఖ్య!  అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం తరువాత అందరికీ ఆన్‌లైన్ మీటింగులు పరిచయమయ్యాయి. అయితే.. ఈ కొత్త పద్ధతికి అలవాటు పడటానికి ప్రజలకు చాలా సమయమే పట్టింది. కొందరు ఇప్పటికీ అప్పుడప్పుడూ తడబడుతుంటారు. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమ మైక్‌ను ఆన్ చేయడం మర్చిపోతారు. అయితే.. గూగుల్ సీఈఓకు కూడా అచ్చం ఇటువంటి పరిస్థితే ఎదురైంది.


పర్యవరణ పరిక్షణ కోసం కొత్త ఆలోచనలను తెరపైకి తేవాలనే ఉద్దేశ్యంతో గూగుల్ డియర్ ఎర్త్ పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గూగుల్ సీఈఓ కూడా ఇటీవల పాల్గొన్నారు. కెర్మిట్ అనే కప్ప వేషం వేసిన వ్యక్తితో పర్యావరణం గురించి సరదా సంభాషణ జపారు. అయితే.. కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ ఆయన మైక్‌ను అన్‌మ్యూట్ చేయడం మర్చిపోయారు. ఈ విషయాన్ని కెర్మిట్ గుర్తుపట్టి..సుందర్‌కు గర్తు చేస్తుంది. ‘నేను గూగుల్ సీఈఓతో సంభాషిస్తునాన్న విషయం మర్చిపోతున్నాను. అయితే ఆయన మ్యూట్‌లో ఉన్నారు..’అంటూ సరదాగా కామెంట్ చేశారు. వెంటనే రెస్పాండైన సుందర్..‘సారీ.. ఈ పొరపాటు ఇటీవల చాలా సార్లు జరిగిందీ’  అంటూ సంభాషణ కొనసాగించారు. మరుసటి రోజు..‘అన్‌మ్యూట్ చేయడం మర్చిపోకండి’ అంటూ మరో ట్వీట్ కూడా చేసిన ఆయన కెర్మిట్‌కు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. 

Updated Date - 2021-10-29T03:16:06+05:30 IST