వృద్ధ దంపతుల ఆత్మహత్య యత్నం

ABN , First Publish Date - 2020-10-20T05:41:43+05:30 IST

ఎస్‌బీఐ మినీ బ్యాంకులో డబ్బులు కట్టినా జమ కాకపోవడంతో మనస్థాపం చెందిన వృద్ధ దంపతులు మండల కేంద్రలోని తహసీల్‌ కార్యాలయం ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు

వృద్ధ దంపతుల ఆత్మహత్య యత్నం

కట్టిన డబ్బులు జమకాకపోవడంతో ఆందోళన


శాయంపేట, అక్టోబరు 19 :  ఎస్‌బీఐ మినీ  బ్యాంకులో డబ్బులు కట్టినా జమ కాకపోవడంతో మనస్థాపం చెందిన వృద్ధ దంపతులు మండల కేంద్రలోని తహసీల్‌ కార్యాలయం ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. పెద్దకోడెపాకకు చెందిన డ్వాక్రా గ్రూపు మహిళ సంఘం అధ్యక్షురాలు కోగిల కొమురమ్మ సంఘం పొదుపు, అప్పు డబ్బులు గత సంవత్సరం నవంబరు29న అదే గ్రామానికి చెందిన ఎస్‌బీఐ మినీ బ్యాంకు నిర్వాహకురాలు సూర్యదేవర వాణికి రూ.32వేలు చెల్లిచింది. డిసెంబరు4న బ్యాంకు నిర్వాహకురాలు వాణి పొదుపులో రూ. 2వేలు, అప్పులో రూ. 12వేలు జమ చేసింది. దీంతో గ్రూపు సభ్యులు మిగిలిన డబ్బులు ఎందుకు జమ చేయలేదని కొమురమ్మను నిలదీయంతో, తాను మినీ బ్యాంకులో డబ్బులు మొత్తం చెల్లించానని తెలిపింది.


ఇదే విషయమై స్థానిక సర్పంచ్‌ అబ్బు ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో బ్యాంకు నిర్వాహకురాలిన పిలిపించగా కొమురమ్మ రూ.14వేలు చెల్లించినట్లు తెలిపింది. దీంతో కొమురమ్మ ఇటీవల శాయంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డబ్బుల విషయంలో న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెందిన కొమ్మురమ్మ, ఆమె భర్త సారయ్యలు శాయంపేట తహసీల్దార్‌ కార్యాలయం భవనం ఎక్కి ఆత్మహత్య యత్నం చేశారు. తహసీల్దార్‌ స్పందించి తమకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో భవనంపై నుంచి కిందికి దిగారు.

Updated Date - 2020-10-20T05:41:43+05:30 IST