పొద్దునే పద్యయత్నం...

ABN , First Publish Date - 2020-12-21T06:49:03+05:30 IST

సవ్వడిలేని నడక కలపర్వతం నించి ఇలపర్వతానికి...

పొద్దునే పద్యయత్నం...

సవ్వడిలేని నడక

కలపర్వతం నించి

ఇలపర్వతానికి


లోయలోని రాత్రితునకలు 

టేకాఫ్‌కి సిద్ధంగా పక్షులై


స్థలం మరణించి

గదంతా నిండిన నువ్వూ

నీ నిండా ఈదుతూ

పేర్లులేని పదాలు 


నదులతో నిండిన చేతివేళ్లు

ముట్టుకుంటే చిగిర్చే కీబోర్డ్‌


గోడలు చేసిన ఖాళీలో

కుమ్మరిసారె మీద

మెల్లిగా విచ్చుకుంటున్న

గుండ్రటి చిరునవ్వు

ఈ పద్యం


పసిపాపల నిద్దర్లతో

వూగుతున్న పూలతో

తయారవుతున్న వుదయంలో

ఇంకా నీడలు ఏర్పడని 

నువ్వూ, నీ పద్యం...

రమణజీవి


Updated Date - 2020-12-21T06:49:03+05:30 IST