Abn logo
Mar 7 2021 @ 00:47AM

డిప్యూటీ చైర్‌పర్సన్‌గా సుచిత్రా ఎల్లా

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను సీఐఐ సదరన్‌ రీజియన్‌ చైర్మన్‌గా కొవిన్‌కేర్‌ సీఎండీ సీకే రంగనాథ ఎన్నికయ్యారు. గతంలో ఆయన డిప్యూటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా భారత్‌ బయోటెక్‌ అరడజను కొత్త మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసిందని చెప్పారు. భారత్‌, అంతర్జాతీయ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరాలను కంపెనీ తీర్చగలదన్నారు.

Advertisement
Advertisement
Advertisement