గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేటలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఫీజు కట్టాలంటూ విద్యార్థిపై మోడ్రన్ విద్యా సంస్థల సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఒత్తిడి తట్టకోలేక వంశీ ఆత్మహత్యాయత్నం చేశాడని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి