ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-16T08:47:53+05:30 IST

ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు

కల్తీపై ఫిర్యాదులకు 040- 21111111 టోల్‌ ఫ్రీ: హరీశ్‌ 

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఐపీఎం, ఫుడ్‌ సేఫ్టీ విభాగం, ల్యాబ్స్‌ పనితీరు, సాధించిన పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్తీ ఆహారంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. కల్తీపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. ఆహార పదార్థాల్లో ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. 040- 21111111 నెంబర్‌కి కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. 

Updated Date - 2022-05-16T08:47:53+05:30 IST