గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

ABN , First Publish Date - 2020-08-16T10:07:02+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత తో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టి.భానుప్రసాద్‌రావు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టి.భానుప్రసాద్‌రావు

భూపాలపల్లి జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు


భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 15: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత తో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టి.భానుప్రసాద్‌రావు అన్నారు. భూపాలపల్లిలోని కలెక్టరేట్‌లో శని వారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండా ఆవిష్కరించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీ కరించారు. అనంతరం ఆయన ప్రజల నుద్ధేశించి మాట్లాడారు. కరోనా ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక డ్బందీ చర్యలు తీసుకున్నారన్నారు. చాలా రాష్ర్టాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవ స్థ చిన్నాభిన్నమైనా మన రాష్ట్రంలో పటిష్టంగా ఉందన్నారు.


ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశంలోనే సుభి క్షమైన రాష్ట్రంగా తయారవుతుందన్నారు. జిల్లాలోని యువత సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మునిసి పాలిటీ పాలకవర్గం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


భూపాలపల్లిటౌన్‌ : భూపాలపల్లి పట్టణంలో స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి. మునిసిపాలిటీలో చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణిసిద్దు జాతీయ జెండాఆవిష్కరించారు. కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ట్రాన్స్‌కో కార్యాల యంలో ఎస్‌ఈ నరేష్‌, డీఈవో కార్యాలయంలో, మండల విద్యా వన రుల కేంద్రంలో ఎంఈవో దేవానాయక్‌ జెండావిష్కరించారు.


కృష్ణకాలనీ : భూపాలపల్లిలోని క్యాంపు కార్యాలయం, లారీ అసో సియేషన్‌, ఇందిరా భవన్‌లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ యువ త మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచిం చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ వి.శ్రీనివాసులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బాలరక్షా భవన్‌లో జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


భూపాలపల్లిరూరల్‌: భూపాలపల్లిలోని జడ్పీ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ వైవి గణేష్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే మండల పరిషత్‌లో ఎంపీపీ మందల లావణ్య, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అశోక్‌ జాతీ య జెండాలను ఎగురవేశారు.

Updated Date - 2020-08-16T10:07:02+05:30 IST