Abn logo
Jan 16 2021 @ 08:50AM

అక్కడ వింత నియమం !

ప్రకృతి అందాలు కనిపిస్తే వెంటనే ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తాం. సెల్ఫీలతో బిజీ అయిపోతాం. ఇక పర్యాటకులైతే కెమెరాలకు పని చెబుతారు. అయితే ఈ పట్టణంలో మాత్రం ఫొటోలు తీయలేరు. ఆ నిబంధనే ఆ నగరంలో పర్యాటకులు పెరిగిపోవడానికి దోహదం చేసింది.


  1. స్విట్జర్లాండ్‌లోని బెర్గున్‌ అనే పట్టణం కొండల మధ్య, పచ్చని పచ్చిక బయళ్ల నడుమ ఉంటుంది. అక్కడి ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. 
  2. ఆ పట్టణం అందాలు ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి చూడాల్సిందే తప్ప, ఇంటర్నెట్‌లో, సోషల్‌ మీడియాలో చూడటం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. అందుకే ఫోటోలు తీయడంపై నిషేధం పెట్టారు.
  3. ఫోటోలు తీయడం నిషేధం అని బోర్డులు సైతం పెట్టారు. ఆ నిబంధన పెట్టాక పర్యాటకుల తాకిడి ఇంకా పెరిగిందట. మౌత్‌ పబ్లిసిటీ వల్ల పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరుగుతోందట.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement