Viral Video: నావలోకి దూసుకొచ్చిన రాకాసి అల.. పరుగులు పెట్టిన ప్రయాణికులు...

ABN , First Publish Date - 2022-02-19T02:40:44+05:30 IST

జర్మనీలో ఇటీవల సంభవించిన లీనియా తుఫాను.. ఉత్తర ప్రాంతాల్లో బీభత్సం స‌ృష్టించింది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న ఓ భయానక ఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video:  నావలోకి దూసుకొచ్చిన రాకాసి అల..  పరుగులు పెట్టిన ప్రయాణికులు...

ఇంటర్నెట్ డెస్క్:  జర్మనీలో ఇటీవల సంభవించిన లీనియా తుఫాను..  ఉత్తర ప్రాంతాల్లో బీభత్సం స‌ృష్టించింది. ఈ క్రమంలోనే  చోటుచేసుకున్న ఓ భయానక ఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుఫాన్ సమయంలో ఓ నావ(ఫెర్రీ) కొంత మంది ప్రయాణికులతో ఎల్బీ నదిపై టుఫెల్స్‌బర్గ్ ప్రాంతం నుంచి ఎయిర్‌బస్ పియర్ వైపు బయలుదేరింది. ఈ క్రమంలో గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో భారీ అలలతో నది అల్లకల్లోలంగా మారింది. ఈ సమయంలో ఎగసిన ఓ రాకాసి అల ఒక్కసారిగా.. పడవ అద్దాలను పగలగొట్టి లోపలకు దూసుకొచ్చింది. 


ఆ సమయంలో.. ప్రయాణికులంతా తమకేం కాదులే అన్న ధిమాతో తమ పనిలో నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో  భారీ అల ఒక్కసారిగా చొచ్చుకురావడంతో వారందరూ భయపడిపోయి అవతలి వైపునకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా.. అద్దాలు పగిలిపోవడాన్ని అక్కడి అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా జరిగాయో లేదో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.



Updated Date - 2022-02-19T02:40:44+05:30 IST