Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.3.5 లక్షల కోట్లు ఫట్‌

 స్టాక్‌ మార్కెట్లో హోరెత్తిన అమ్మకాలు

చిన్న, మధ్య స్థాయి షేర్లు విల విల 

వరుసగా రెండో రోజూ నష్టాల్లో సూచీలు 

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 456.09 పాయింట్లు (0.74%) కోల్పోయి 61,259.96 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 152.15 పాయింట్ల (0.83%) పతనంతో 18,266.60 వద్ద క్లోజైంది. సముచిత స్థాయికి మించిన ధరల్లో ట్రేడవుతున్న కంపెనీ ల షేర్లలో మదుపర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణం. అమ్మకాల హోరులో స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.3.55 లక్షల కోట్ల మేర ఆవిరైంది. దీంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.267.87 లక్షల కోట్లకు పడిపోయింది. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్‌ సంపద రూ.6.82 లక్షల కోట్లకు పైగా తగ్గింది. 


స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి ఫిస్డమ్‌: వెల్త్‌ టెక్‌ కంపెనీ ఫిస్డమ్‌ తన కస్టమర్ల కోసం స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను ప్రారంభించింది. మొబైల్‌ యాప్‌, వెబ్‌, టర్మినల్‌ యాక్సె్‌సతో కూడిన కంపెనీ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈక్విటీ, డెరివేటివ్‌, ఐపీఓ, ఎఫ్‌పీఓ, షేర్ల బైబ్యాక్‌, ప్రభుత్వ గోల్డ్‌ బాండ్లు, ఎన్‌సీడీ, కరెన్సీ, ఈటీఎ్‌ఫల క్రయవిక్రయాల సేవలు అందించనున్నట్లు తెలిపింది. 


భారత ఈక్విటీ మార్కెట్‌ చాలా కాస్ట్‌లీ! ప్రాధాన్యాన్ని తగ్గించిన యూబీఎస్‌ 

చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుండటంతో ఆసియాన్‌ దేశాల్లోకెల్లా భారత స్టాక్‌ మార్కెట్‌ చాలా కాస్ట్‌లీగా మారిందని, దాంతో ఆకర్షణ కోల్పోయిందని  అంతర్జాతీయ బ్రోకరేజీ సేవల సంస్థ యూబీఎస్‌ అంటోంది. అంతేకాదు, భారత మార్కెట్‌పై తన వైఖరిని ‘తటస్థం’ (న్యూట్రల్‌) నుంచి ‘తక్కువ ప్రాధాన్యం’ (అండర్‌ వెయి ట్‌) స్థాయికి తగ్గించింది. భారత్‌తో పాటు తైవాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లపైనా యూబీఎస్‌ ఇదే వైఖరిని కనబర్చింది. అలుపెరగని బుల్‌ ర్యాలీతో దేశయ మార్కెట్‌ సూచీలు అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement