Abn logo
May 14 2021 @ 10:17AM

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నప్పటికీ దేశయంగా కోవిడ్ భయాలు వెంటాడుతుండడంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ రోజు (శుక్రవారం) ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. 


48,898 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10.10 గంటల సమయానికి 82 పాయింట్లు లాభపడింది. ఇక, 14,749 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ ఉదయం 10.10 గంటల సమయానికి 10 పాయింట్లు ఎగబాకింది. ఆసియన్ పెయింట్స్, యూపీఎల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలను ఆర్జిస్తున్నాయి. గ్రాసిమ్, విప్రో, హిందాల్కో, టాటా స్టీల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement