Abn logo
Mar 3 2021 @ 05:25AM

ఐపీఎల్‌ను అవమానించిన స్టెయిన్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

ఇస్లామాబాద్: ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించి, ప్రపంచ నెంబర్ వన్‌ పేసర్‌గా ఎదిగిన సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్.. ఇప్పుడు తన ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతూ మన ఐపీఎల్‌పై విమర్శలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐపీఎల్‌లో ఆడటం కన్నా మిగతా దేశాల లీగుల్లో ఆడటమే బాగుంటుందని అన్నాడు.


పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతూ..  స్టెయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఐపీఎల్‌లో డబ్బుపైనే అందరి దృష్టీ ఉంటుందని స్టెయిన్ అన్నాడు. ‘‘ఐపీఎల్‌లో భారీ స్క్వాడ్‌లు ఉంటాయి. పెద్ద పెద్ద పేరున్న ఆటగాళ్లుంటారు. వీటన్నిటిపై దృష్టి పెట్టడంతో చివరకు క్రికెట్ ఆట మరుగున పడిపోతుంది’’ అని స్టెయిన్ చెప్పాడు. పీఎస్‌ఎల్‌ను మెచ్చుకొని ఐపీఎల్‌ను ఇలా అవమానించడంపై నెటజిన్లు స్టెయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అనువాదం: ఐపీఎల్ జట్లలో ప్లేయింగ్ 11లోకి నేను వెళ్లలేకపోతున్నా. ఆర్‌సీబీ కూడా నన్ను బెంచికే పరిమితం చేసింది’’ ఇదే స్టెయిన్ అన్నది అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘‘అత్యున్నత స్థాయిలో పోటీ పడలేకపోతే ఇలానే విమర్శించాలి’’ అని మరో నెటిజన్ చురకలేశాడు.

Advertisement
Advertisement
Advertisement