Global CEOs indian origin: గ్లోబల్ దిగ్గజ సంస్థలకు సీఈఓలుగా 9మంది భారత సంతతి వ్యక్తులు

ABN , First Publish Date - 2022-09-02T15:02:55+05:30 IST

ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్(starbucks) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా(new chief executive officer)...

Global CEOs indian origin: గ్లోబల్ దిగ్గజ సంస్థలకు సీఈఓలుగా 9మంది భారత సంతతి వ్యక్తులు

Starbucks: ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ కొత్త సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్

వాషింగ్టన్ : ప్రపంచ స్థాయి పలు సంస్థలకు భారతీయ సంతతికి( Indian-origin) చెందిన వ్యక్తులే సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ స్థాయి 9 కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు భారత సంతతికి చెందిన వ్యక్తులే సీఈఓలుగా ఉండటం విశేషం.తాజాగా ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్(Starbucks) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా(New Chief Executive Officer) భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ను( Indian-origin Laxman Narasimhan) నియమిస్తున్నట్లు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది.  ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్చ బాటా సీఈఓగా సందీప్ కటారియా,గూగుల్(google) సీఈఓగా సుందర్ పిచ్చయ్, మైక్రోసాఫ్ట్(microsfot) సీఈఓగా సత్యనాదెళ్ల, అడోబ్ సంస్థ సీఈఓగా శంతను నారాయణ్, ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ణ, వీఎం వేర్ సీఈఓగా రఘు రఘురాంలు వ్యవహరిస్తున్నారు.


స్టార్ బక్స్ ప్రస్థుత సీఈఓ హోవార్డ్ సూహుల్ట్‌జ్ స్థానంలో అక్టోబరు 1వతేదీ నుంచి నరసింహన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.లక్ష్మణ్ నరసింహన్ రెకిట్(Reckitt) కంపెనీకి కూడా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రెకిట్ సంస్థ డూరెక్స్ కండోమ్స్, ఎన్ ఫామిల్ బేబీ ఫార్ములా, మూసినెక్స్ కోల్డ్ సిరప్ లను ఉత్పత్తి చేస్తోంది. రెకిట్ సంస్థ నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు లక్ష్మణ్ ప్రకటించగానే ఆ కంపెనీ షేర్లు 4 శాతం పడిపోయాయి. స్టార్‌బక్స్ సంస్థకు అమెరికాలో 200 కంటే అధిక కాఫీ షాపులున్నాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన సిబ్బంది వేతనాలు, కొవిడ్ పరిమితుల వల్ల విదేశీ మార్కెట్ లో కాఫీ చైన్ వ్యాపారం మందగించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ స్టార్ బక్స్ లో సీఈఓగా చేరబోతున్నారు.గతంలో పెప్సికోలో(PepsiCo) గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా నరసింహన్ పనిచేశారు.

Updated Date - 2022-09-02T15:02:55+05:30 IST