కొవిడ్‌ విధులకు ప్రోత్సాహకాలు లేవు

ABN , First Publish Date - 2020-09-25T09:33:58+05:30 IST

కరోనా నేపథ్యంలో సోమాజిగూడలోని దక్కన్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ విధులు నిర్వర్తించామని, డ్యూటీలు చేసిన రోజులకు తమకు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) ఇవ్వడం లేదని స్టాఫ్‌నర్సులు ఆ ఆస్పత్రిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు...

కొవిడ్‌ విధులకు ప్రోత్సాహకాలు లేవు

  • దక్కన్‌ ఆస్పత్రి యాజమాన్యంపై స్టాఫ్‌ నర్సుల ఫిర్యాదు


పంజాగుట్ట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో సోమాజిగూడలోని దక్కన్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ విధులు నిర్వర్తించామని, డ్యూటీలు చేసిన రోజులకు తమకు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) ఇవ్వడం లేదని స్టాఫ్‌నర్సులు ఆ ఆస్పత్రిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 21 నుంచి ఆగస్టు 22 వరకు కొవిడ్‌ విధులు నిర్వర్తించామని, ఇందుకు గాను తమకు ఇన్సెంటివ్‌లు రావాల్సి ఉందని  వారు తెలిపారు. యాజమాన్యాన్ని అడిగితే డబ్బులు లేవంటూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు వారి వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ధ్రువపత్రాలతో పాటు తాము చేసిన కొవిడ్‌ డ్యూటీలకు ఇన్సెంటివ్‌లు ఇప్పించాలని కోరుతున్నారు.


Updated Date - 2020-09-25T09:33:58+05:30 IST