తిరుమల: తిరుమల (Tirumala)లో సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తులు తిరుమలకు రావొద్దని చెప్పడం లేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు ఓపికతో శ్రీవారిని దర్శించుకోవాలని, ఇకపై నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.