వైభవంగా ధ్వజావరోహణం

ABN , First Publish Date - 2020-09-28T10:26:51+05:30 IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో పుష్కరిణిలో

వైభవంగా ధ్వజావరోహణం

శాస్త్రోక్తంగా చక్రస్నానం..ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 


తిరుమల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో పుష్కరిణిలో జరగాల్సిన చక్రస్నానాన్ని ఆలయంలోనే పూర్తి చేశారు. ఉదయం 9-10గంటల మధ్యలో అయిన మహల్‌ ముఖమంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత అయినా మహల్‌ ముందు ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణి(నీటి తొట్టె)లో సుదర్శన చక్రాన్ని మునకలు వేయించారు. రాత్రి 8గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కాగా, తిరుమలలో మంగళవారం నుంచి షోడశదిన సుందరకాండ దీక్ష నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-09-28T10:26:51+05:30 IST