Abn logo
Sep 29 2020 @ 08:18AM

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం

Kaakateeya

కర్నూలు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి  వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 209.5948 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Advertisement
Advertisement
Advertisement