శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-08T13:55:33+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి.. నీటిని దిగువకు విడుదల చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నంద్యాల : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి.. నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో : 1,23,942  క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1,46,593 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 212.4385 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2022-08-08T13:55:33+05:30 IST