కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 55,600 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212 టీఎంసీలుగా ఉంది.