Abn logo
Jan 14 2021 @ 08:23AM

శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కర్నూలు జిల్లా: శ్రీశైలం ఆలయంలో వైభవంగా మకర సంక్రాంతి  బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ప్రధాన అర్చకులు ఉత్సవమూర్తులకు శోడోపచార పూజలు నిర్వహించారు. అలాగే ఈ సాయంత్రం స్వామి అమ్మవార్లు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ రాత్రి అమ్మవారి కల్యాణం జరగనుంది. కాగా ఆలయ మాఢ వీధులలో శ్రీస్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహనసేవలు నిర్వహిస్తున్నట్లు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement