శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ అరెస్టు

ABN , First Publish Date - 2020-07-05T22:50:19+05:30 IST

శ్రీలంక కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం కొలంబోలోని...

శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ అరెస్టు

కొలంబో: శ్రీలంక కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం కొలంబోలోని పానాదురా ప్రాంతంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కుశాల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కుశాల్ తన ఎస్‌యూవీలో బయటకు వెళ్లాడు. అయితే ఓల్డ్ గాలే రోడ్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని గుద్దేశాడు. దీంతో 64 ఏళ్ల ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు కుశాల్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2020-07-05T22:50:19+05:30 IST