Abn logo
Feb 21 2020 @ 12:34PM

శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు..

తిరుపతి: కన్నుల పండువగా శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం ఇంద్ర విమానం వాహనంపై చంద్రశేఖరుడు నాలుగు మాఢవీధుల్లో ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు స్వామివారి పక్కనే చప్పరాన్ని అధిరోహించి విహరించారు. ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. ఈనెల 19 నుంచి శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement