Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీలో చేరికలు..వైసీపీలో రాజుకుంటున్న నిప్పు

శ్రీకాకుళం: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయం కూడా అంతే. ఒక్కోసారి ఒక్కో పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉంటారు. టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగానే ఉంది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జిల్లా వాసులు ఒక్క అవకాశం ఇద్దామనుకున్నారేమో తెలియదు కానీ వైసీపీని బలపర్చారు. పది అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రస్తుత పరిణామాలు అధికార పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. 

రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ విజయం సాధించింది. కంబాల జోగులును రెండు సార్లు ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే అధికారం ఉన్నా లేకపోయినా లోపల పని తీరులో మాత్రం తేడా కనిపించడంలేదు. ఎన్నో ఆశలతో జోగులు గెలుపు కోసం కష్టపడిన నేతలే ఇప్పుడు ఆయన తీరును చూసి పక్క చూపులు చూసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పేరుకే కంబాల జోగులు ఎమ్మెల్యే అయినప్పటికి ఆయన చుట్టూ ఉండే చోటా మోటా నేతలదే పవర్ అంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. 


Advertisement
Advertisement