మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
ABN , First Publish Date - 2021-08-27T12:20:24+05:30 IST
కొన ఊపిరితో పోరాడుతున్న ఓ మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాలవలస మండలం గాజులకొల్లి వలస జంక్షన్ వద్ద బస్‌షెల్టర్ సమీపంలోని
శ్రీకాకుళం: కొన ఊపిరితో పోరాడుతున్న ఓ మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాలవలస మండలం గాజులకొల్లి వలస జంక్షన్ వద్ద బస్‌షెల్టర్ సమీపంలోని ఓ పంట పొలంలో గుర్తుతెలియని మహిళ బురదలో కూరుకు పోయి చలనం లేకుండా పడిఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ వైకుంఠరావు అక్కడకు చేరుకొని ఆ మహిళను బయటకు తీసి పరిశీలించారు. ఆమె కొన ఊపిరితో ఉన్నట్లు గ్రహించి.. వెంటనే స్నానం చేయించి సపర్యలు చేశాడు. అనంతరం 108 వాహనంలో సమీపంలోని జొన్నవలస సామా జిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకుంది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని.. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాలు దక్కాయని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్ వైకుం ఠరావును ఎస్పీ అమిత్‌బర్దర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో పోలీసులు తోటివారికి మానవత్వంతో సహాయస హకారాలు అందించాలని సూచించారు.