శ్రీదేవిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: జవహర్‌

ABN , First Publish Date - 2021-12-31T23:16:15+05:30 IST

ఎమ్మెల్యే శ్రీదేవిని తక్షణమే బర్తరఫ్ చేయాలని మాజీమంత్రి జవహర్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

శ్రీదేవిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: జవహర్‌

అమరావతి: ఎమ్మెల్యే శ్రీదేవిని తక్షణమే బర్తరఫ్ చేయాలని మాజీమంత్రి జవహర్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవగాహన లేనివారు రాజ్యాంగ పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. పదే పదే అంబేద్కర్‌ను అవమానించడం శ్రీదేవి మానుకోవాలని హితవుపలికారు. శ్రీదేవి వైఖరిని సీఎం జగన్‌రెడ్డి ఖండించకపోవడం మద్దతుగా భావించాలన్నారు. జగ్జీవన్ రామ్‌ని గుర్తు చేసుకోవడం కోసం అంబేద్కర్‌ను అవమానించడం సరికాదన్నారు. జగన్ అహంభావని, అదే బాణిని వైసీపీ నేతలు కొనసాగిస్తున్నారని జవహర్‌ దుయ్యబట్టారు.


Updated Date - 2021-12-31T23:16:15+05:30 IST