Ap: ఈ వృద్ధురాలి బాధ.. బాధ కాదు..

ABN , First Publish Date - 2022-07-25T01:36:30+05:30 IST

పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ (Mla Sankaranarayana) సోమందే‌పల్లి గ్రామంలో గడపగడపకు...

Ap: ఈ వృద్ధురాలి బాధ.. బాధ కాదు..

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ (Mla Sankaranarayana) సోమందే‌పల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమం నిర్వహించారు. అయితే అడుగడునా ఆయనకు సమస్యలు ఎదురవుతున్నాయి. దుర్గానగర్‎లో 73 ఏళ్ల వృద్ధురాలు ఎల్లమ్మ (Old Woman Ellamma) కు అధికారులు పెన్షన్ (Pension), రేషన్ (Ration) కట్ చేశారు. దాంతో ఆమె అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఎల్లమ్మ విన్నవించుకున్నారు.


మరోవైపు ఎమ్మెల్యే కార్యక్రమానికి వాలంటీర్ (volunteer) డుమ్మా కొట్టాడు. వేరే వాలంటీర్‎కు సమస్య పరిష్కరించమని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు ఎల్లమ్మ వేడుకుంటున్నారు. 


Updated Date - 2022-07-25T01:36:30+05:30 IST