షెహన్‌ మదుషంక కాంట్రాక్ట్ రద్దు చేయనున్న శ్రీలంక క్రికెట్ బోర్డు

ABN , First Publish Date - 2020-05-26T20:30:03+05:30 IST

మాదక ద్రవ్యాల కేసులో శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్‌ షెహన్‌ మదుషంక కాంట్రాక్ట్‌ను రద్దు చేసే యోచనలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక

షెహన్‌ మదుషంక కాంట్రాక్ట్ రద్దు చేయనున్న శ్రీలంక క్రికెట్ బోర్డు

కొలంబో: మాదక ద్రవ్యాల కేసులో శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్‌ షెహన్‌ మదుషంక కాంట్రాక్ట్‌ను రద్దు చేసే యోచనలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ సీఈవో యాష్లె డె సెల్వా మాట్లాడుతూ.. ‘‘దీనిపై మాకు అధికారికంగా సమాచారం రాలేదు. అతను కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్. కానీ అతనిపై ఉన్న డ్రగ్స్ కేసు రుజువైతే.. అతని కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాము’’ అని అన్నారు. 


మాదక ద్రవ్యాల కేసులో షెహన్‌ మదుషంకను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో కారులో వెళ్తుండగా ఆపి తనిఖీలు చేయగా.. అతడి వద్ద రెండు గ్రాముల హెరాయిన్‌ లభించినట్టు పోలీసులు తెలిపారు. అతడితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు చెప్పారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే మదుషంక హ్యాట్రిక్‌తో సంచలనం సృష్టించాడు. 

Updated Date - 2020-05-26T20:30:03+05:30 IST