IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ABN , First Publish Date - 2021-07-18T20:25:17+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భారత్-శ్రీలంక మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మరోమాటకు

IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మరోమాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఈ సిరీస్‌లో నెగ్గడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలని చూస్తుండగా, యువ జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్ సత్తా చాటాలని చూస్తోంది. భారత యువ జట్టుకు శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తుండగా, శ్రీలంక జట్టును దాసన్ షనక నడిపించనున్నాడు.

Updated Date - 2021-07-18T20:25:17+05:30 IST